నా కవితలు
1) తెలుగు పలుకు
====================
---------
ఆలాపన
--------
తెలుగు భారతి మకుటంబున...
వజ్రములై వెలగగా తెలుగు అచ్చులు
ధగధగా మెరయు నగలలో
ముత్యంబులై కాంతులు వెదజల్లగా హల్లులు
తెలుగు తల్లి పదముల సుమములై
వొదుగగా మన తెలుగు పదములు
ఏ కాలాలో, ఏ లోకాలలో, ఏ శ్లోకాలు
వల్లించగా మన నాలుక కు కలిగెనో
తెలుగు పలుకు, పలుకు భాగ్యము!!
చరణం 1
---------
కలువ పూల సొగసు
కమలముల నగవు
రామ చిలుక పలుకు
రమణి కులుకు
తళుకు బెళుకు లెన్నో
కలిగి యుండు పలుకు
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు
--------
చరణం 2
---------
తెలుగు పలుకు పలుకుగ
మోము దివ్యంగా వెలుగు
తెలుగు పలుకు వినగ
చెవికి హాయి కలుగు
తెలుగు పలుకు చదవగ
యెదన బాధ తొలుగు
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు
---------
చరణం 3
---------
కడలిలో ఊయలూగు
అలలు వోలె
గాలిలో తేలి యాడు
ఖగం వోలె
హాయి గొలుపు పలుకు
ఆనందపు పలుకు
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు
---------
చరణం 4
---------
అమ్మ కమ్మని ప్రేమ
నాన్న చల్లని కరుణ
తోబుట్టువుల మమత
కలబోత ఈ పలుకు
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు
---------
చరణం 5
---------
తెలుగులోన పిలువ
తెలుగులోనె కొలువ
వెలుగులు చిమ్ముతూ
వేలుపులే దిగిరారె
తేనె లొలుకు పలుకు
తేట తెలుగు పలుకు
===========
2) కూతురు
===========
మా వరాల గారాల తల్లి
అనురాగాల వల్లి
విరిసిన మల్లె పూవల్లె ...
నీ మోమున వెలెసె చిరునవ్వు
తరగని తరాల తృప్తిని మాకివ్వు
అమ్మ నాన్న అనె నీ పిలుపు
మా జీవితాలకు ఓ మేలుకొలుపు
అది చెరగని ఆనందం
మా మదిలో నిలుపు
మా జీవితాలలో నీ రాక
తెచ్చెను ఓ వెలుగు రేఖ
మార్చెను మా నుదుటి రేఖ
తీర్చెను ఎల్లలు లేని కోరిక
కూర్చెను మరు మల్లెల హారిక
నీవు ముద్దులిచ్చిన పొద్దు
మా ఆనందానికి లేదు ఏ హద్దు
నీవు అలిగిన సమయాన
మా మనసు నలిగెను భయాన
నీతో గడిచిన ప్రతి క్షణం
నీతో నడిచిన ప్రతి పదం
హిమమె కురిసె
సుమమె విరిసె
చెరగనె లేదు
మా చెంపలపై
నీ ముద్దుల చెమ్మ
ఆరనె లేదు మా ఒడిలో
నీవు చేసిన తడి
మరువనె లేదు
తడబడి బుడిబుడి
ఆడుగులు నడచిన తీరు
ఇంతలోనె వడి వడిగా
రోజులు గడిచి
వచ్చెనె ఓణీల సంబరం
ఆపైన వేగముగ కాలం గడిచి
ఏ రాకుమారుడొ రెక్కలు కట్టుకొని
మన ఇంటి పైన వాలి
చక్కగా నిను పట్టుకెళ్ళితే
బిక్కు బిక్కు మనుచు
దిక్కు తెలియక రేయి పగలు
మాకు మిగులునె దిగులు
==============
3) అన్నా హాజారె
==============
జోహారు జోహరు
అన్నా హజారె
మీ జోరుకి సర్కారె...
బలదూరె
ఓ అన్నా హాజారె
జీవితమె బడియాయె
ఉపకారమె ఊపిరాయె
భయం లేని బ్రతుకె నీదాయె
ఓ అన్నా హాజారె
అక్రమాల పేటలకు
అవినీతి కోటలకు
బీటలు వాటిల్లు జేసి
రాజ బాటలు వేయగ
ఊపినావయా బావుటా
ఓ అన్నా హజారె
కరడు గట్టిన ఖైధీలు
కాలంతక హాంతకులు
ఎందరొచ్చిన బెదరని
తిహారు జైలు
నువ్వడుగిడిన ఘడియలోనె
గడగడ వణికెనయ్యా
ఓ అన్నా హజారె
అలుపు లేని వయస్సు నీది
కలుపు లేని మనసు నీది
జన శ్రేయస్సు కోరు తలపు నీది
తుది గెలుపు నీదే కదా
ఓ అన్నా హజారె
ఇంటి నిండ బిడ్డలే భరత మాతకు
అవినీతి తంట వంట పట్టదే శిశివుకు
ఆ తల్లీ! కంటినీరు తుడుపగ నీవు
నడుము కట్టినావాయ్య
ఓ అన్నా హజారె
4) మేలు
===============
ఫోన్ పట్టి నడుపు
బైకిస్టు కన్నా
గన్ను పట్టి నడిచె...
టెర్రరిస్టు మేలు
ఐయెయస్ అధికారుల కన్నా
వీదులందు తిరుగు
అభిసారికలు మేలు
తరుగు దుస్తుల వెలుగు
సితారల కన్నా
చిరుగు చీరల మెలుగు
నిరుపేద తరుణులు మేలు
ఐదు నక్షత్రాల
పూటకూళ్ళ
ఇళ్ళ కన్నా
చరపల్లి జైలు మేలు
రాజధాని
రహదారుల కన్నా
పల్లెటూరు దిగుడు
బావులు మేలు
నేటి రాజకీయ
మంత్రుల కన్నా
నాటి మాయాల
మాంత్రికులు మేలు
నగరపు కలుషిత
వాయువుల కన్నా
యమపురిన వదులు
విష వాయువులు మేలు
దీక్షగా అఫీసుల
చుట్టు తిరుగుట కన్నా
యముడు విధించు
శిక్షలు మేలు
====================
5) నేటి వార్తలు (2011)
=============
దూరవాణి వినిన దూరదర్శిని కనిన
దురవార్తలే కాని
మధుర వార్తలు కరువు
ఓ వైపు
స్కాముల గోలలు
స్వాముల లీలలు
సకల జనుల సమ్మెలు
ఇనుప గనుల దొమ్మీలు
నేతల రాజీనామాలు
ఆ పై రాజీ డ్రామాలు
రోజు వారి బంధులు
తాజా ఇబ్బంధులు
కూలే గాలి సామ్రాజ్యాలు
రాలె గాలి గోపురాలు
మరో వైపు
ఉద్యమాలలో
అమాయకుల
ఉసురులే పోవు
అయితే
ఏ నాయకుల
ఊపిరిలు ఆగిపోవు
బందు నాడు
మందు షాపులు
బారులు,సినిమా హాల్లు
తెరిచియుండు
బడులు, ఆసుపత్రులు
మందుల షాపులు
మూసి యుండు
అధిక సంతానం కలిగిన
భారత మాతకు
ఉత్తర కుమారులే మెండు
అవినీతిపై పోరాటానికి
ఓ వృద్ధ సైనికుడు
కావలసి యుండు
అందుకే
దూరవాణి వినిన
దూరదర్శిని కనిన
దురవార్తలే కాని మధుర వార్తలు కరువు
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec11/kavita-1.html
=============================
6) తెలంగాణ మనది రా(2007)
తెలంగాణ మనది రా
మనం తెలంగాణరా
తెలంగాణ వేరుపడితె
తెలంగాణ ఏర్పడితె ...
బ్రతుకంతా వెలుగే రా
చీకటులు తొలగును రా
మన బీడు భూములు
పాడి పంటలతో వూగురా
కర్షక కార్మిక
కష్టాలు తొలగిపోవురా.
తెలంగాణ
తెలంగాణ మనది రా
మనం తెలంగాణరా
ఎవడువాడు ఎచటివాడు
మన నీరు త్రాగినోడు
మన భూములు దోచినోడు
ఈ దోపిడిలు ఇకపై సాగవురా
చిల్లర రాజకీయాలు
నేటినుండి చెల్లవురా
తెలంగాణ మనది రా
మనం తెలంగాణరా
ప్రతి గళముది ఒకే పాట
ప్రతి కలముది ఒకే మాట
ప్రతి గుండెది ఒకే సద్దు
ప్రతి అడుగుది ఒకే లక్ష్యం
అదే తెలంగాణ రా
మన వెలుగుల ఠాణా రా
పసిడి పోలాల కోన రా
తెలంగాణ మనది రా
మనం తెలంగాణరా
తెలంగాణా వీరుడా
తెలంగాణా ధీరుడా
శౌర్యం నీ సొత్తు రా
సమరం నీ వృత్తి రా
తుదిదాక పోరు సలుపు
దరి రానికే అలుపు
చివరి శ్వాస దాక
నీ ధ్యాస తెలంగాణారా
తెలంగాణ మనది రా
మనం తెలంగాణరా
7) ఈ క్రింది లింకులో ఎడమవైపు menuలో "కవితా కౌముది" అనె అర్టికల్ లో కృష్ణ అక్కులు పైన క్లిక్కు చేసి "MatruBaasha" పైన వ్రాసిన కవిత చదవగలరు http://koumudi.net/Monthly/2008/january/index.html
====================================
8) ప్రకృతితల్లీ
==========
ఓ ప్రత్యక్షదేవతా
ప్రకృతిమాతా
క్షుద్భాదకి ఫలం
దాహార్తికి జలం
నిలువ నీడకి స్థలం
ఇచ్చికన్న తల్లీ
కన్న మిన్నయైన
ఓ!! ప్రకృతితల్లీ
నీమది మోదమై
ముదితమై మురిసేవేళ
హిమ ఉషస్సులు
ఇంధ్రధనుస్సులు
విరిసేవిరులు
పారేఝరులు
తరులు గిరులు
సెలయేళ్ళు జలపాతాలు
కానాలు కోనలు
లఓయలు పలు
హొయల సొయగాలతో
రంగుల హంగులతో
మమ్ము అలరిస్తావు
ఆనందింప జేస్తావు
నీ ఉల్లం చల్లంబైన
తరుణంలో
కన్నీరు మున్నీరులా
వరుణిడివై వర్షిస్తావు
లేదా మెల్లగా చల్లగా
తెల్లగా హిమమే కురిసి
ధరచే తెల్లచీరనే
దరింప జేస్తావు
నీయెద విషాధమై
వ్యధభరితమైనవేళ
శవాలైనపువ్వులు
ఎముకలైనవఋక్షాలు
నగ్నమైనకొండలు
భగ్గుమనేబండలు
మండే ఎండలు
ఎడారులు బిడారులు
కావిస్తావు
మరి ఆగ్రహమే
ఆవహించిన వేళ
రాకాసి జోరుతో
పిశాచి హోరుతో
జాలిలేనిగాలులు
ఉప్పెనలు వరదలు
భూకంపాలు సునామీలు
కత్రినా రీటాల పేరిట
వికృత రూపంతో
విలయతాండవంతో
జేస్తావు ఇలాతలం
కళేబరాలనిలయం
సదా ఆగ్రహం మరచి
అనుగ్రహించు తల్లీ !!
ఈ క్రింది లింకిపైన క్లిక్ చేసి చదవండిhttp://www.siliconandhra.org/…/suja…/january2008/prakrti.php
==============================
9) ఉగ్రవాదం (2001) | ||
| ||
----------------------
నేడే స్నేహితుల దినం
సన్నిహితుల దినం
అన్నదమ్ములతో
ఎర్పడునది
రక్తబంధం
పిల్లలు
తల్లిదండ్రులతో
ఎర్పడునది
పేగుబంధ
ం
ఇల్లాలితో
ఎర్పడునది
పోగుబంధం
కాని..
ఏ బంధములేకుండా
గోత్రం, వర్జ్యం,
రాశి, ముహుర్
తం గతం, మతం
కులం, బలం
అస్తులు, అంతస్తులు
ఇవి ఏవి చూడకుండా
దొరికె చెలిమి
బ్రతుకున మనకు
కలుగు గొప్ప కలిమి
అన్ని అందరితో పంచుకోలేం
అత్మీయతను పెంచుకోలే
ం ఒక్క స్నేహితులతో తప్ప
ఒక్కొకసారి తల్లి దండ్రులు
పిల్లల విషయాలను వారి
friends ద్వారా తెలుసుకొంటారు.
బాధలతో కృంగిన వేళ
అవమానంతో తల వొంగిన వేళ
భుజం తట్టి, అందించే హాస్తం
దైవంతో సమానం ఆ నేస్తం
శత్రువుల కలవాడికన్న
మిత్రులు లేనివాడు
మిక్కిలి దురదృష్టవంతుడు
కాలం గడిచెకొలది
స్థితులు మారెకొలది
దూరం పెరిగె కొలది
మునుపటి నెయ్యం
తరగకుండ
అనుబంధం
చెరగకుండ
ఓ స్నేహం వుంటె
అది ఎంతో భాగ్యం
మరెంతో సౌఖ్యం
-------------------------------------
సుపరచితమైన గది
సురక్షితమైన గది
అలసిన వచ్చిన వేళ
సేద దీరనిచ్చిన గది
భాదతో వచ్చిన వేళ
ఓదార్చిన గది
సెలవు దీనాన మక్కువగా
ఎక్కువగా
గడపాలనుకొనె గది
మరెందుకో.
. ఈ రోజు
ఆగది అంటె
భయమేస్తుంది.
పదనాలుగు రోజులు
గృహ నిర్భంధం
(home quarantine) కన్నా.
పదునాలుగేళ్ళు వనవాసం మేలుకదా..
అక్కడ వనమంతా తిరగవచ్చు.
నిజానికి పదనాలుగు రోజులు
గృహ నిర్భంధంకాదు
అది గది నిర్భంధం
(room quarantine)
నిజానికి అదొక దిగ్బంధం
ఒకే ఇంటిలో వున్న
ముఖాలు చూసుకొలేని పరిస్థితి
అవసరాలకు సెల్లు ఫోనులోనె భేటి
ఆకలేసిన వేళ
గది తలుపు వైపే చూపు
శబ్ధం వినగానె
భోజనం వచ్చిందని
ఆనందం
తలుపు తీయగానె
ద్వారం ముందు
భోజనం వున్న కంచం.
తిరిగె ఫ్యాన్,
వెలిగె లైట్
మేమున్నాం అని చెబుతున్నా
రోజులు గడిచె కొద్ది
నాలుగు గోడలను
చూస్తూ ఎదో భయం
మొత్తం మీద
నా quarantine
ఒక నూతన అనుభవం.
====నూతన వర్షం (2021)====
------------------------------
గడచిపోయే ఇంకో సంవత్సరం
నడచివచ్చే మరో సంవత్సరం
గోడపైన నున్న క్యాలండర్
దిగాలుగుంది.
క్రొత్త క్యాలండర్ గోడ వైపు
చూస్తూంది.
గత రెండు వర్షాలు (years) తెచ్చె
రెండు తరంగాలు(waves)
బతకని వాళ్ళు
'చితికి' పోయిరి
బతికినవారు అసుపత్రి
బిల్లు వల్ల చిల్లులుపడి
చితికిపోయిరి
లేదు పెట్రొలు
ధరకు కంట్రోలు
లేదు ధరలకు తాళం
చేరె బ్రతుకు పాతాళం
మన బతుకుల్ని
మార్చేంత ఇంద్రజాలం
మారే కాలమునకు
లేదని మనకు తెలుసు
కాని..
నడిరేయి వచ్చే ఈ సంబరం
ఏదో నూతన ఆరంభం
ఇస్తూంది యని ఒక ఆశ
నిజమే
ఆశే కదా మనిషిని నడిపిస్తోంది!
ఆశే కదా బతుకును శ్వాసిస్తోంది!
అయితే బతుకు భారాన్ని
కాలం మీదికి నెట్టకు
కాళ్ళూచేతులూ ముడుచుకొని
మంచి కాలం ముందుందని
కాలయాపన చెయ్యకు
ఏమరుపాటుగా ఉంటే
తప్పదు నివ్వెరపాటు
అపేయ్ పురాతన విషాద గీతం
పాడయే నూతన కిరాకు గీతం
తొలగనీ పాత భయాలు
కలగనీ క్రొత్త జయాలు
అందరు మంచే ఎంచాలని
అందరికి మంచే జరగాలని
ఆశీస్తూ, ఆకాంక్షిస్తూ
డెందం నిండా ఆనందంతో
నా ఈ నూతన వర్ష శుభాకాంక్షలు
********************
రైతు ఉద్యోగ ప్రకటనలు
------------------------
కావాలి : వరి పండిచే రైతులు (100000 ఉద్యోగాలు)
అనుభవం :3 సంవత్సరాలు
కావాలి : కూరగాయలు పండిచే రైతులు (200000 ఉద్యోగాలు)
అనుభవం :4 సంవత్సరాలు
కావాలి : ఆవులు మేపే కురాళ్ళు (50000 ఉద్యోగాలు)
అనుభవం :2 సంవత్సరాలు
పండించే రైతులు కరువై
పై ప్రకటనలు వచ్చే రోజులు
ఎంతో దూరంలో లేవు.
సరే...
మన సంక్రాంతి పండుగకి వద్దాం
ఇది రైతుల పండుగ
యేడాదంతా మొద్దుగా పనిచేసి
గాదెలు నింపిన ఎద్దుల పండగ
(appraisal for bullocks)
అందుకే
ఎద్దుల కొమ్ములకు రంగులు
ఒళ్ళుకు బురికీల హాంగులు
అలా అలంకరించి జరుపుకొనెదే
ఈ Thanks giving పండుగ
భోగీకి ఊరు చేరాలని
భారంగా సాగే బోగీలు,
కిక్కిరిసిన బస్సులు,
దారుల నిండ
బారులు తీరిన కారులు
వడి వడిగా పల్లె చేరాలని
పిల్లల గుండెసడి
చేరువైన పిల్లలను చూసి
తల్లుల కంటతడి
ముద్దమందారంలా
ముగ్ధ సింగారంలా
వయ్యారంగా
లెక్కలు కట్టి
చుక్కలు పెట్టి
హిమ ఉషస్సులో
ఇంద్రధనుస్సులా ఓ ముగ్గు
సుమ పథంలా ఓ ముగ్గు
రాముని రథంలా మరొ ముగ్గు
అలా వీధులంతా
వెల్లువయ్యె
రంగు రంగుల
రంగవల్లులు
అయితే మారే కాలం
చేసే ఇంద్రజాలం వలన
పల్లెలలో వచ్చెను
ఏన్నో మార్పులు
హారిదాసులు
గంగెరెద్దులు
నేడు కనరాం
నేటి మగువలకు
మచ్చుకైన నచ్చకపోయె
అచ్చమైన గొబ్బిళ్ళ పాటలు
పచ్చిగా పచ్చిగా
పిచ్చిగా మెచ్చి రాయే
ఊ.. అంటావా
ఊహూ.. అంటావా
యనెడి పాటలు
నమ్మిన భూమిని
అమ్మగా తలచి
నాగలి పట్టి
సాగును చేసి
నారును పోసి
పైరును చేసి
స్వేదం జల్లి
సేద్యం చేసి
వైద్యం తీరున
కలుపును తీసి
గిట్టుబాటు ధర అందక
పెట్టుబడి పోయాక
ప్రభుత్వాల చేయూత లేక
వరి పండించే రైతు
ఉరికి గురి అవుతున్నాడు.
పత్తి రైతు తల దగ్గర పత్తి
దీపపు వొతై వెలుగుచున్నది
పురుగుల మందు పంట పురుగును
చంపలేక పోయింది.
కాని తాగిన వెంటనె రైతును
చంపేసింది.
ఉదయం లేసింది మొదల
త్రాగే కాఫీ, కట్టే బట్ట
తినే టిఫిన్, బిరియాని అన్నీటికి మూలం రైతు
కావున రైతే మన రియల్ హీరో
అయితే అప్పు కట్టలేనప్పుడు
ఇంటి కప్ఫుకు వేలాడడం తప్ప
విదేశాలకు ఎలా తప్పుకోవాలో తెలియని
అమాయకుడు
అనామకుడు
అర్భకుడు
మన కర్షకుడు
మాయలు చేసే రీల్ హీరోలను
రియలు హీరోలుగా తలచి
చీకటి మార్కెట్‌లో సినిమా టిక్కెట్ ధరను
పెంచమని ప్రభుత్వాలపై గొంతు చించుకొనె
మనం, వీర ఘనులం, ధీర జనులం
అలాంటి మనం,
రైతుకెమైన చెయ్యగలమా!!!
ఆలోచిద్దామా!!!
రైతును గౌరవిద్దాం
చేతనైన చేయూతనిద్దాం
జై కర్షకుడా, జై అన్నదాత
ఇవే ఇవే మా సంక్రాంతి శుభాకాంక్షలు
-------------------
------------------------------
--------------------------


*గురువులకు నమస్కారం 2023***
ReplyDeleteదిద్దించితిరి
పలకపైన చేతిరాత
మార్చితిరి
మా నుదుటి రాత,
మా చేతి గీత,
అయ్యెను మీ మాట
మాకు భగవద్గీత
విరిగిన బెత్తాలు
వేసిన గోడ కుర్చీలు
చేసిన ఒంటికాలు తపస్సులు
తీసిన గుంజీలు
ఎక్కిన బెంచీలు
ఇవి మాకు వేసిన
శిక్షలు కావు
బండతనం
మొండితనం
మాలో పోగొట్టి
మంచితనం
వ్యక్తిత్వం
క్రమశిక్షణ
అలవడడానికి
మీరు మాకు
ఇచ్చిన శిక్షణ
మాత్రమే
నేర్పితిరి
ఎక్కాలు
లెక్కలు
సూత్రాలు
సిద్దాంతాలు
పదాలు
పద్యాలు
తెలుగు వ్యాకరణాలు
రసాయన సమీకరణాలు
దూలాలు పట్టుకొనె
స్థితికి మేము ఎదిగిన
మా మూలాలు నేలను
అంటుకొనె వుండడానికి
కారణం మీరు నేర్పిన
పెదబాలశిక్ష,
సుమతీ శతకం
వేమ శతకం
ఆవిధంగా
మా కలలు
నిజం చేసి,
మాలో కళలు
పెంపొందించి,
ఆశలు
చిగురింపజేసి
ఆశయాలు
రగిలింపజేసితిరి
అటువంటి మీకు
గురు దక్షిణలాగ
ఏమి ఇవ్వగలను
ఏకలవ్వుడిలా
ఏక వేలును(బొటన వేలుని)
ఇవ్వలేను
కావున మనసారా
మీకు
ఏక నమస్కారం
మాత్రం
సమర్పించుకొంటాను.
---కృష్ణ అక్కులు
*పాలనా భవనం*
ReplyDelete----------------------
శత్రువుకు సైతం
సాయంచేసె మానవత్వం (ex: Turky),
అన్నిజీవుల పట్ల
సమానత్వం,
బిన్నత్వంలో
ఏకత్వం
ఇదే నా భారతదేశం
జగతికి ఇచ్చు సందేశం
అనే భావం వుట్టిపడేలా
మనవారు
నిర్మించిరటా..
ఈ పాలనా భవనం
అదే పార్లమెంట్ భవనం
అందులో..
అగుపించి
అదృశమయ్యే
జలశాయాలులేవు
కాని....
అదిరెలా
త్రిపుర వెదురుతో
చేసిన flooring,
దర్జాగ వుండేలా
పరచిరి
మిర్జాపూర్ తివాచీలు
తెరచినవున్న ద్వారంలా
కనబడి, మాయమై
తలబొడిపి కట్టించే
గోడలు లేవు
కాని..
నాగపూర్
కలపతో చేసిన
తలుపులు, ద్వారాలు
కుర్చీలు, మేజాలు
ఆడి పాడి
పాలకులను
మైమరిపించి
గాబరాపెట్టి
గాయపరిచి
గాయబ్ అయ్యే
శృంగార
నర్తకీమణులు
లేరు
కాని
అంతకు మించి
రంభ, ఊర్వశిలే
కుళ్ళుకునేలా
కళ్ళు చెదిరెలా
అందంగా అమర్చిరి
రాజస్తాన్
శిల్పరూపాలు
ఇన్నీ
హంగులతో
రంగులతో
నిర్మితమైన
ఈ సౌధమును, గాంచి
విశ్వకర్మ విస్తుపోయినా
విశ్వేశ్వరయ్య విస్మయం చెందినా
మయుడికి మాటలు రాకపోయినా
వింతలేదు
కాని..
స్కూల్ పిల్లలకన్నా
దారుణంగా
అరుపులు,
కేకలు,
బాయ్‌కాట్లు,
వాకౌట్లు,
అధికార
పార్టీపట్ల కక్ష
విపక్షాలపట్ల వివక్ష
ఇలా చెడుని వీడి
నేతల మనంలో
మంచి మార్పు రానంతకు వరకు
నూతన భవనమైన
పాడుబడిన భవనమైన
జనంకు ఒరిగెదేమి లేదు
చివరికి అది
కొత్త సీసాలో
పాత సారా లాగే
అవుతుంది.
*రెండువేల నోటు 2023*
ReplyDeleteనోట్లలలో
నీవొక మణి
త్వరలో ఆగును
నీ చెలామణి
దోచుకొనెవారికి
దాచుకొనెవారికి
అయ్యావు
నీవు సులభం
మరియు
వారికి బలం
మధ్యాహ్న భానుడిలా
వెలిగిన నీవు,
చీకటి మింగిన సూర్యడిలా
నల్లధనమైనావు,
నేతలకు
ఇంధన మైనావు
ఇప్పుడు..
వాలి పోయిన
పొద్దులా,
రాలి పోయిన
ఆకులా
గాలి కెగురు
దూళిలా
కూలిపోయిన
భవనంలా
కాలి పోయిన
వనంలా అయిన
నిను చూస్తే
జాలి కలుగుతుంది
ఏమిటి
ఓ నోటూ,
పేదలకు
అందుబాటు
లేక పోవడమేనా,
నీవు చేసిన
పొరపాటు,
మరి
ఏల నీకీ చేటు
ఎందుకు నీపై
ఈ వేటు
ఏ నోటుకు ఎంత
చేటు వచ్చినా
ఒకరి చిరునవ్వు
చెరగదు
ఎందుకంటే
ఒకనోటు పోతే
ఆయనకి
బోసి నోటితో
నవ్వడానికి
ఇంకో ఆరు నోట్లున్నాయి
*నీకోసం*
ReplyDelete--కృష్ణ అక్కులు
అచేతనమైన దానిని
అమాయకమైన దానిని
అంటావు.
మత్తులు కలిగిస్తావు
గమ్మత్తులు చేయిస్తావు
కాని అమ్మాయిని
కానంటావు
పిల్లలు, పెద్దలు
స్త్రీలు, పురుషులు
అధికులు, అల్పులు
ఎవరు వచ్చినను
అందరిని
సమానంగా
అదరిస్తావు
బరిస్తావు
అయితే..
నీ కోసం
ఎన్ని
పోరాటాలు
ఆరాటాలు
కుట్రలు
పంచే నోట్లు
కొనే ఓట్లు
వినలేని తిట్లు
వెన్నుపోట్లు
తెగని మంతనాలు
పగలతో పంతాలు
అంతా నీకోసమే
ఇంతకు
నీవెవరంటే
నీవొక "కుర్చీవి"
(కర్ణాటక 2023 ఎన్నికల
ఫలితం సందర్భంగా)